యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం — చెన్నై
ఎప్పటికప్పుడు తమను పునరుత్తేజం మరియు పునరుజ్జీవనం చేసుకోవడానికి వెళ్ళే భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే ఒక జలాశయంలా ఇది నిరూపించుగొనుగాక…
— శ్రీ శ్రీ దయామాత
చెన్నై ఏకాంత ధ్యాన వాసమును 2010లో అంకితం చేసిన సందర్భంగా పూర్వపు సంఘమాత మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాతగారి శుభాశీస్సుల పలుకులు, యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, చెన్నై యొక్క పరిణామ ఎదుగుదలను సూచిస్తాయి.
ఈ ఆశ్రమం ప్రేమతో కూడిన శ్రమకు పరాకాష్ట — భగవంతుడికి మరియు గురుదేవులకు అవిశ్రాంతంగా చేసిన సేవాస్ఫూర్తికి ఒక తీపి నిదర్శనం. మొదట నిర్జన ప్రదేశంలో ఒక చిన్న ధ్యాన కుటీరంతో ప్రారంభమై, నగర జీవితంలోని హడావుడి గందరగోళాల మధ్య పునరుజ్జీవనం కోరుకునే భక్తుల కోసం క్రమేణా ఒక ఆధ్యాత్మిక ఒయాసిస్సుగా ఎదిగింది.
శ్రీపెరంబుదూర్ సమీపంలోని మన్నూర్ గ్రామం వద్ద, చెన్నై నుండి ఒక గంట ప్రయాణ దూరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని 1973లో వై.ఎస్.ఎస్. కు చిరకాల భక్తులైన శ్రీ గైతోండే ఒక స్థలంగా దీనిని కొనుగోలు చేసి, చివరికి 1998లో వై.ఎస్.ఎస్. కి విరాళంగా సమర్పించారు. డిసెంబర్ 31, 2006న, ప్రధాన భవనానికి స్వామి శాంతానంద శంకుస్థాపన చేశారు. జూలై 25, 2010న స్వామి సుద్ధానంద ఈ ఏకాంత ధ్యాన వాసాన్ని ప్రారంభించి సన్యాసుల మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
చెన్నైలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంలో పవిత్రమైన ప్రదేశాలు కొలువై ఉన్నాయి, భక్తులు తమ సాధన, అధ్యయనాన్ని పునరుజ్జీవింపజేసుకొని పరమహంస యోగానందగారి రాజయోగ బోధనలను కనుగొనడానికి వీలు కల్పిస్తాయి. ఆదివారం సత్సంగం మరియు రోజువారీ ధ్యానాలకు హాజరుకావడంతో పాటు, పరమహంస యోగానందగారు ప్రసాదించిన ధ్యాన ప్రక్రియలకు సంబంధించి వై.ఎస్.ఎస్. సన్యాసుల ఆధ్యాత్మిక సలహాలను మరియు మార్గదర్శకత్వం పొందడానికి భక్తులు ఆహ్వానించబడతారు.
వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసం వై.ఎస్.ఎస్. ఆశ్రమ స్థాయికి పెంచడం జరిగింది
సాధనా సంగమం ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఒక సత్సంగంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు, వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసం ఇక వై.ఎస్.ఎస్. ఆశ్రమంగా పిలువబడుతుందని, మరియు రాబోయే సంవత్సరాల్లో ఒక పూర్తి స్థాయి ఆశ్రమంగా అభివృద్ధి చేయబడుతుందని లాంఛనంగా ప్రకటించారని ఎంతో సంతోషంతో మీకు మేము తెలియజేస్తున్నాం.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసమును వై.ఎస్.ఎస్. ఆశ్రమంగా స్థాయి పెంచుతున్నట్లు ప్రకటించారు.
ధ్యాన మందిరం మరియు ధ్యాన ప్రదేశాలు
ధ్యాన మందిరం
వై.ఎస్.ఎస్. గురుపరంపరకు నిలయంగా ఉన్న ధ్యాన మందిరం ఆశ్రమ ప్రాంగణంలో ఒక స్మారక ఆవరణగా ఉంది. దాదాపు 65 మంది కూర్చొనేందుకు వీలుగా ఉండే ఈ సభా మందిరాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మరియు ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానాల కోసం ఉపయోగిస్తారు.
సాధనా సంగమాలు, బాలల శిబిరాలు మరియు ఏకాంత ధ్యాన వాసములను నిర్వహించే సమయంలో వివిధ కార్యకలాపాలు, తరగతులు మరియు సత్సంగాలకు కూడా ఇది కేంద్రంగా ఉంది.
ధ్యాన ప్రదేశాలు
చెన్నై ఆశ్రమంలో నిర్మించిన మొదటి నిర్మాణం ధ్యాన కుటీరం. నిర్మలమైన మన్నూర్ సరస్సుకు ఎదురుగా, నిరాడంబరమైన ఈ కుటీరం ధ్యానానికి పవిత్ర ప్రదేశంగా మారింది.
ఈ మైదానాలలో భక్తులు ప్రకృతితో మమేకమయ్యేందుకు మరియు మధ్యలో ధ్యానంలోకి వెళ్ళేందుకు సహాయపడే వివిధ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో వన వేదిక, ఒక మండపం, ఒక కలువ సరస్సు మరియు సరస్సుకు ఎదురుగా ఒక మెడిటేషన్ టవర్ ఉన్నాయి.
ఆశ్రమ ప్రదేశాలలో అనేక రకాల కొబ్బరి మరియు మామిడి చెట్లు, అనేక రకాల పువ్వులు మరియు కూరగాయల తోటలు ఉన్నాయి. సౌకర్యవంతంగా కూర్చోవడానికి అనేక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన బెంచీలు, ప్రకృతిలో ఉన్న దైవత్వంతో భక్తులు అనుసంధానం పొంది శరీరం, మనస్సు మరియు ఆత్మపరంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
ఆశ్రమంలో సౌకర్యాల మధ్యంతర అభివృద్ధి
దైనందిన ధ్యానాలు, ఆధ్యాత్మిక సలహాలు, సత్సంగాలు, సాధనా సంగమాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు స్మారకోత్సవాలతో వై.ఎస్.ఎస్. భక్తులకు సేవలందించే నిమిత్తం చెన్నై ఏకాంత ధ్యాన వాసంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు శాశ్వతంగా ఉండేందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఆమోదం తెలిపారు. అప్పటి నుండి, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, ఇంకా చాలామంది భక్తులు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం మరియు మార్గదర్శకత్వం కోరుతున్నందున రాబోయే కాలంలో ఈ రద్దీ ఇంకా పెరుగుతుందని ఊహిస్తున్నాం.
ప్రస్తుతమున్న సౌకర్యాలు — మౌలికంగా ఒక ఏకాంత ధ్యాన వాసం కోసం రూపొందించినవి — ఇప్పుడు పెరిగిన ఆవశ్యకతలకు సరిపోనివి. ఆశ్రమం విస్తరించిన పరిస్థితుల్లో సహాయకారిగా ఉండేందుకు వసతి, వంటశాల, భోజన ప్రాంతాలు, పరిపాలన మరియు ఇతర అనుబంధ సౌకర్యాలను ముఖ్యంగా అభివృద్ధి చేయవలసి ఉన్నది.
సందర్శించేందుకు మీరు యోచించండి
సామూహిక ధ్యానంలో పాల్గొనడానికి లేదా ఆశ్రమ ఉద్యానవనాల ప్రశాంతతను ఆస్వాదించడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మీరు ఆశ్రమాన్ని సందర్శించడానికి ఆసక్తి కలిగి ఉంటే, అపాయింట్‌మెంట్ కోసం మా రిసెప్షన్ డెస్క్ ను దయచేసి సంప్రదించండి.
దయచేసి గమనించండి: ఆశ్రమ ప్రాంతాలు సందర్శకులందరికీ ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:30 వరకు తెరిచి ఉంటాయి.
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు ఐదు రోజుల వరకు ఆశ్రమంలో ఉండడానికి ఆహ్వానితులు. పునరుత్తేజం మరియు పునరుజ్జీవనం కోసం భక్తులు వ్యక్తిగతంగా ఏకాంత వాసం చేయమని లేదా నిర్వహించబడే ఏకాంత ధ్యాన వాసములలో ఏదోఒకదానిలో మాతో కలిసి పాల్గొనమని మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ ఏకాంత ధ్యాన వాసముల సమయంలో, వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే సామూహిక ధ్యానాలలో ప్రతిరోజు రెండుసార్లు మీరు పాల్గొనవచ్చు మరియు యోగదా సత్సంగ బోధనల అధ్యయనం మరియు అభ్యాసంలో ఆధ్యాత్మిక సలహాలను మరియు మార్గదర్శకత్వాన్ని వారి నుండి పొందవచ్చు.
ప్రతి వారం కార్యక్రమాలు
సామూహిక ధ్యానాలు
ఆశ్రమంలో జరిగే క్రమబద్ధమైన ధ్యానం మరియు సత్సంగాలకు అందరు అనుమతించబడతారు. నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయకమైన పఠనంతో ఈ సమావేశాలు కూడి ఉంటాయి.
- ఆదివారం
- ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
- ఆదివారం సత్సంగం (ఒక సంక్షిప్త ధ్యానంతో సహా)
- సాయంత్రం 4:30 – రాత్రి 7:30
- సాయంత్రపు ధ్యానం
- గురువారం
- ఉదయం 7:00 – ఉదయం 8:00
- ఉదయపు ధ్యానం
- సాయంత్రం 6:00 – రాత్రి 9:00
- సాయంత్రపు ధ్యానం
- ఇతర రోజులు
- ఉదయం 7:00 – ఉదయం 8:00
- ఉదయపు ధ్యానం
- సాయంత్రం 6:00 – రాత్రి 7:30
- సాయంత్రపు ధ్యానం
బాలల సత్సంగం
బాలల సత్సంగం వారం మార్చి వారం ఆదివారాలలో నిర్వహించబడుతుంది, దీనిలో 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలు కథలు చెప్పడం, సంక్షిప్త నిర్దేశిత ధ్యానాలు, ఇతర పరస్పర అభ్యాస పద్ధతులు, వంటి ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా వై.ఎస్.ఎస్. బోధనలు మరియు జీవన విధానం గురించి తెలుసుకుంటారు. మరింత తెలుసుకోండి
- ఆదివారం
- ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
వై.ఎస్.ఎస్. సాధనా సంగమాలు
వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు, సామూహిక ధ్యానాలు, సంకీర్తన కార్యక్రమాలు మరియు సన్యాసుల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నిర్వహించే ఒక నాలుగు-రోజుల కార్యక్రమం పరమహంస యోగానందగారి బోధనలలో మునిగిపోయే ఒక ప్రత్యేక అవకాశాన్ని యోగదా సత్సంగ విద్యార్థులకు అందిస్తుంది.
జనవరి–డిసెంబర్, 2024 • వివిధ కార్యక్రమాలు • ఐదు ప్రదేశాలు
సమాచారం మరియు కార్యక్రమ ప్రకటనలను పొందేందుకు వై.ఎస్.ఎస్. ఈ-వార్తలకు సైన్ అప్ అవ్వండి
రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు
నెలవారీ దీర్ఘ ధ్యానం
- అక్టోబర్ 27, ఆదివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- నవంబర్ 24, ఆదివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
క్రిస్మస్ 8-గంటల ధ్యానం
- డిసెంబర్ 21, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 6:00
- సామూహిక ధ్యానం