యోగదా సత్సంగ శాఖా మఠం
రాంచీ, ఝార్ఖండ్
వై.ఎస్.ఎస్., ఒక వంద సంవత్సరాలకుపైగా, దాని వ్యవస్థాపకులు పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతా సేవలను కొనసాగిస్తోంది. 1918 రాంచీలో, ఒక ఆశ్రమం మరియు బాలుర కోసం జీవించడం-ఎలా అనే ఒక పాఠశాలను స్థాపించడం ద్వారా క్రియాయోగం యొక్క సార్వత్రిక బోధనలను అందుబాటులోకి తీసుకువచ్చే తమ జీవిత కార్యాన్ని ప్రారంభించారు.
ఈ ఆశ్రమం యొక్క పవిత్రమైన ఆవరణలోనికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ఆశ్రమం అద్భుతమైన ఉద్యానవనాలతో మరియు ఆయన పవిత్ర స్పందనలతో మహిమాన్వితముగా శోభిల్లుతుంది. ఆశ్రమంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే రోజువారీ సామూహిక ధ్యానాలు, వ్యక్తిగత లేదా సామూహిక ఏకాంత ధ్యాన వాసాలు, సాధనా సంగమాలు, ప్రత్యేక కార్యక్రమాలు లేదా ప్రతి వారం జరిగే సత్సంగాలలో పాల్గొనండి. మీ మనస్సు మరియు ఆత్మకు సేదతీర్చేలా కట్టిపడేసే సహజ సౌందర్యంతో కూడిన ప్రశాంతమైన వాతావరణంలో నిమగ్నమవ్వండి. మీరు ఇక్కడ మా సన్యాసుల నుండి వై.ఎస్.ఎస్. బోధనల అధ్యయనం మరియు అభ్యాసంలో ఆధ్యాత్మిక సలహాలను మరియు మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు.
ఆశ్రమంలోని ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలు
పరమహంస యోగానందగారి గది
ఆ మహాగురువులు రాంచీలో (1918 నుండి 1920 వరకు) ఉన్న సంవత్సరాలలో బస చేసిన గది ఒక పవిత్ర మందిరంగా భద్రపరచబడింది. ఆశ్రమంలోని పాత పరిపాలనా భవనంలో ఇది ఉంది. ప్రతిరోజూ కొన్ని గంటలపాటు వ్యక్తిగత ధ్యానం కోసం అందరికీ ఇది తెరిచి ఉంచబడుతుంది. భక్తులు మరియు సందర్శకులు ఇక్కడ ధ్యానం చేసినప్పుడు ఉన్నతమైన అనుభూతి పొందుతారు. పరమహంస యోగానందగారు ఉపయోగించిన చెక్క మంచంతోపాటు, గురుదేవుల చేతిముద్రలు మరియు పాదముద్రలు కూడా ఆ గదిలో ప్రదర్శించబడుతున్నాయి. ఇంకా గురుదేవులకు చెందిన కొన్ని వ్యక్తిగత వస్తువులు ఈ గది వెలుపల ప్రదర్శన కోసం ఉంచబడ్డాయి. మరింతగా తెలుసుకోండి
లిచీ వేది
రాంచీ ఆశ్రమంలో మన దివ్యమైన గురుదేవులతో సంబంధం ఉన్న పవిత్ర ప్రదేశాలలో లిచీ వేది ఒకటి. ఈ విశాలమైన లిచీ వృక్షపు పందిరినీడ క్రింద, బాలుర కోసం ఆయన స్థాపించిన పాఠశాలలో మహాగురువులు తరచుగా బహిరంగ తరగతులు మరియు సత్సంగాలు నిర్వహించేవారు. పరమహంసగారి ఆధ్యాత్మిక స్పందనలతో ఈ ప్రదేశం పవిత్రమయినందున, దాని కొమ్మల క్రింద ప్రతిష్టించబడిన పరమహంసగారి పెద్ద చిత్రం ఉన్న ఈ చెట్టు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు సందర్శకుల తీర్థయాత్రకు మరియు ధ్యానానికి ఒక ప్రియమైన ప్రదేశంగా ఉన్నది. మరింతగా తెలుసుకోండి
స్మృతి మందిరం
1920లో ఒక రోజు ధ్యానం చేస్తుండగా పరమహంసగారికి ఒక అంతర్దర్శనం కలిగింది, అందులో అమెరికా వెళ్ళేందుకు దైవ ఆదేశాన్ని ఆయన అందుకున్నారు, ఈ ఉత్కృష్టమైన అనుభవాన్ని గురించి తన పుస్తకం ఒక యోగి ఆత్మకథలో ఆయన ఇలా వ్రాశారు: “‘అమెరికా! వీళ్ళు కచ్చితంగా అమెరికన్లే!’ కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలోని సామానుగదిలో, దుమ్ముపట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నాను…అంతర్దర్శనం కొనసాగింది; అపార జనసమూహం ఒకటి తదేకంగా నావేపు చూస్తూ నటీనటబృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదికమీద అడ్డంగా సాగిపోయింది.”
పైన పేర్కొన్న సామానుగది ఉన్న ప్రదేశంలోనే, ప్రపంచవ్యాప్త కార్యానికి తొలి అడుగు ఇక్కడ పడినందుకు, ఒక స్మారక చిహ్నంగా 1995లో స్మృతి మందిరం నిర్మించబడింది. పగలంతా మందిరం తెరిచి ఉంటుంది, భక్తులు మరియు సందర్శకుల వ్యక్తిగత ధ్యానాల కోసం వినియోగించబడుతుంది. మరింతగా తెలుసుకోండి
ధ్యాన మందిరం
ధ్యాన మందిరంలో ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహిస్తారు. 2007లో జోధ్పూర్ రాతితో నిర్మిచబడిన ఈ విస్తృతమైన భవంతి ఒకేసారి 300 మంది భక్తులు కూర్చునే విధంగా నిర్మించబడింది. సామూహిక ధ్యాన సమయాలు మరియు మందిరం తెరిచి ఉంచే వేళలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరింతగా తెలుసుకోండి
ధ్యాన వనాలు
ఆశ్రమ ప్రాంగణంలోని ప్రదేశాలు, అనేక మొక్కలు మరియు వృక్షాలకు నిలయంగా ఉండే విభిన్నమైన సుందర ప్రకృతి దృశ్యాలతో కూడిన వనాలు వెదజల్లినట్లుగా ఉంటాయి. నీడనిచ్చే మామిడి తోటలు, పనస చెట్ల బాటలు, సతతహరిత లిచీ వృక్షాలు మరియు సొగసుగా చెల్లాచెదురుగా ఉండే అలంకారప్రాయమైన వెదురు పొదలు, అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక రమ్యమైన ప్రదేశాన్ని సృష్టిస్తాయి, ప్రపంచంలో అలసిపోయిన ఆత్మలు ఇక్కడకు వచ్చి శాంతి మరియు ఆనందం యొక్క అమృతంలో పాలుపంచుకోమని ఇవి ఆహ్వానిస్తాయి. ప్రపంచం యొక్క చింతలను విడిచిపెట్టి శరీరం, మనస్సు మరియు ఆత్మలో విశ్రాంతి తీసుకోవచ్చని ఒక వ్యక్తి చాలా సులభంగా గ్రహిస్తారు. ఈ పవిత్ర పరిసరాలలో ఒకవ్యక్తి కూర్చుని ధ్యానం చేసి తన లోపలికి వెళ్ళేందుకు లేదా నిశ్శబ్దంగా కూర్చుని శాంతి మరియు ప్రశాంతతలో మునిగిపోయేందుకు అనేక బల్లలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. మరింతగా తెలుసుకోండి
రాజర్షి జనకానందగారికి వ్రాసిన తన లేఖలో, పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు,
నా ఆధ్యాత్మిక సంపద యొక్క అదృశ్య మకరందాన్ని మౌంట్ వాషింగ్టన్ [లాస్ ఏంజిలిస్ కాలిఫోర్నియాలోని సెల్ఫ్-రియలైజేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం] మరియు రాంచీలో నేను వెదజల్లాను…
మీ సందర్శనకు ఏర్పాట్లు చేసుకోండి
ఒక సామూహిక ధ్యానంలో పాల్గొనేందుకు లేదా ఆశ్రమ వనాల ప్రశాంతతను ఆస్వాదించేందుకు లేదా యోగానందగారికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలకు తీర్థయాత్ర చేసేందుకు మీకు స్వాగతం పలుకుతున్నాము. ఆశ్రమ ప్రాంగణంలో నిర్దేశిత పర్యటన పట్ల మీకు ఆసక్తి ఉంటే, ఏర్పాట్ల కోసం దయచేసి మా ఆహ్వాన కేంద్రాన్ని (రిసెప్షన్ డెస్క్) సంప్రదించండి.
దయచేసి గమనించండి: సందర్శకులందరికీ ప్రతి రోజు ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:30 వరకు ఆశ్రమ ప్రాంగణం తెరిచి ఉంటుంది.
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు ఆశ్రమంలో అయిదు రోజుల వరకు ఉండేందుకు స్వాగతం. పునరుత్తేజం మరియు పునరుజ్జీవనం పొందేందుకు భక్తులు ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసం లేక నిర్వహించబడే ఏదో ఒక ఏకాంత ధ్యాన వాసంలో మాతో కలిసి పాల్గొనమని మేము ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏకాంత ధ్యాన వాసాల సందర్భంగా, వై.ఎస్.ఎస్. సన్యాసులు ప్రతి రోజు రెండుసార్లు నిర్వహించే సామూహిక ధ్యానాలలో మీరు పాల్గొని, యోగదా సత్సంగ బోధనల అభ్యాసం మరియు అధ్యయనంలో ఆధ్యాత్మిక సలహా మరియు మార్గనిర్దేశం పొందవచ్చు.
మీరు వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థి కానట్లయితే లేక ఆశ్రమంలో కాకుండా దగ్గరలోని హోటల్లో నివసించాలనుకుంటే, సమీపంలో ఉన్న హోటళ్ళ జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
ప్రతి వారం కార్యక్రమాలు
రాంచీ ఆశ్రమం నియమానుసారంగా నిర్వహించే ధ్యానాలు మరియు సత్సంగాలలో జనులందరికీ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలు, నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.
- ఆదివారం
- ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
- ఆదివారం సత్సంగం (ఒక సంక్షిప్త ధ్యానంతో కూడి ఉంటుంది)
- సాయంత్రం 4:00 – రాత్రి 7:30
- సాయంత్రపు ధ్యానం
- గురువారం
- ఉదయం 7:00 – ఉదయం 8:00
- ఉదయపు ధ్యానం
- సాయంత్రం 6:00 – రాత్రి 9:00
- సాయంత్రపు ధ్యానం
- ఇతర రోజులు
- ఉదయం 7:00 – ఉదయం 8:00
- ఉదయపు ధ్యానం
- సాయంత్రం 6:00 – రాత్రి 7:30
- సాయంత్రపు ధ్యానం
రాంచీ ఆశ్రమంలో ప్రతి వారం ఒక బాలల సత్సంగం నిర్వహించబడుతుంది, ఇందులో 5 నుండి 12 సంవత్సరాల వయస్సుగల బాలలు కథ చెప్పడం, సంక్షిప్త ధ్యానాలు మరియు ఇతర పరస్పర జ్ఞాన పద్ధతుల వంటి వాటిద్వారా జీవన విధానాన్ని గురించి మరియు వై.ఎస్.ఎస్. బోధనల గురించి నేర్చుకొంటారు. మరింతగా తెలుసుకోండి
- ఆదివారం
- ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
వై.ఎస్.ఎస్. సాధనా సంగమాలు
వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు, సామూహిక ధ్యానాలు, కీర్తనలు మరియు సన్యాసుల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో కూడిన ఒక నాలుగు-రోజుల కార్యక్రమం, పరమహంస యోగానందగారి బోధనలలో నిమగ్నమయ్యేందుకు యోగదా సత్సంగ విద్యార్థులకు ఒక అద్వితీయమైన అవకాశాన్ని కలుగజేస్తుంది.
జనవరి – డిసెంబర్, 2024 • అనేక కార్యక్రమాలు • అయిదు ప్రదేశాలు
నవీకరణలు మరియు కార్యక్రమ ప్రకటనల కోసం వై.ఎస్.ఎస్. ఈ-వార్తలకు సైన్-అప్ చేసుకోండి
ప్రత్యేక కార్యక్రమాలు & దీర్ఘ ధ్యానాలు
నెలవారీ దీర్ఘ ధ్యానం
- అక్టోబర్ 27, ఆదివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- నవంబర్ 24, ఆదివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
క్రిస్మస్ 8-గంటల ధ్యానం
- డిసెంబర్ 21, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 6:00
- సామూహిక ధ్యానం