సన్యాసులు నిర్వహించే ధ్యాన కార్యక్రమాలతో పాటు వై.ఎస్.ఎస్. ఆన్లైన్ ధ్యాన కేంద్రము యొక్క ప్రతి వారం క్యాలెండర్ లో భక్తులు నిర్వహించే ధ్యాన కార్యక్రమాలను కూడా మేము అందిస్తున్నాము.
దయచేసి గమనించండి: మే 6 నుండి ప్రారంభమై, ప్రతి సోమవారం సాయంత్రం 5.10 నుండి 7.30 (భారత కాలమానం) వరకు హిందీలో భక్తుల నేతృత్వంలో నిర్వహించబడే మరొక దీర్ఘ ధ్యానం జోడించబడింది.
ధ్యాన సమయం వివరాలు
ఉదయం జరిగే ధ్యాన కార్యక్రమములు
ఉదయం 6:40 – ఉదయం 8:00 వరకు (ఇంగ్లీష్)
శనివారం మరియు ఆదివారం మినహా ప్రతిరోజు
సాయంత్రం జరిగే ధ్యాన కార్యక్రమములు
సాయంత్రం 6:10 – రాత్రి 7:30 వరకు (ఇంగ్లీష్)
మంగళవారం మరియు బుధవారం మినహా ప్రతిరోజు
సాయంత్రం 6:10 – రాత్రి 7:30 వరకు (తెలుగు)
ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారాలు
సాయంత్రం 6:10 – రాత్రి 7:30 వరకు (తమిళం)
ప్రతి నెల మొదటి మరియు మూడవ సోమవారాలు
సాయంత్రం 6:10 – రాత్రి 7:30 వరకు (బెంగాలీ)
ప్రతి నెల రెండవ మరియు నాల్గవ సోమవారాలు
సాయంత్రం 6:10 – రాత్రి 8:30 వరకు (ఇంగ్లీష్)
(దీర్ఘ ధ్యానం)
ప్రతి బుధవారం
ప్రతి ధ్యాన కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల సామూహిక అభ్యాసంతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత ప్రారంభ ప్రార్థన, ఆధ్యాత్మిక దైనందిని చదవడం, విశ్వగీతం పాడడం, అనంతరం కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. అనంతరం పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియను అభ్యాసం చేయడం మరియు ముగింపు ప్రార్థన ఉంటాయి. ఈ ధ్యాన కార్యక్రమాలలో ప్రతి దానిలో విశ్వగీతమును ఆంగ్లము మరియు ధ్యానము నిర్వహించబడుతున్న భాషలో పాడబడతాయని దయచేసి గమనించండి.
బుధవారం సాయంత్రం జరిగే సుదీర్ఘ ధ్యాన కార్యక్రమం యొక్క వివరాలు:
శక్తిపూరణ వ్యాయామాల సామూహిక అభ్యాసంతో దీర్ఘ ధ్యానం ప్రారంభమవుతుంది, తరువాత ప్రారంభ ప్రార్థన, స్ఫూర్తిదాయక పఠనం, భక్తి గీతాలాపన మరియు 30 నుండి 50 నిమిషాల పాటు రెండు భాగాలుగా జరిగే నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ ధ్యాన కార్యక్రమం ముగుస్తుంది.
సన్యాసులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో ఈ ఆన్లైన్ ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడవని దయచేసి గమనించగలరు.
ధ్యాన కార్యక్రమాలలో ఎలా పాల్గొనాలో తెలియకపోతే దయచేసి సందర్శించండి: “ఆన్లైన్ ధ్యాన కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి.”
మీరు వీటిని చదవడానికి ఇష్టపడవచ్చు: