“శిష్యరికాన్ని గాఢతరం చేసుకోవడం” — వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ యొక్క ప్రాథమిక పురోగతి

13 జనవరి, 2024

నా గురుదేవులతో మరింత అనుసంధానం పొందవచ్చుననే వి.ఎల్.డి యొక్క వాగ్దానం వల్ల నేను అందులో చేరాను. నా జీవితాన్ని భగవంతునికి అంకితం చేయడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని సేవ చేయడం అనే ఆశీస్సులతో నేను పులకించిపోయాను. అటువంటి ఆశీస్సులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వి.ఎల్.డి. యొక్క కార్యకలాపాలన్నీ నా సాధనపై మరింతగా దృష్టి పెట్టడానికి మరియు గతంలో కంటే మరింతగా “ఆధ్యాత్మిక విధులు” [వి.ఎల్.డి. సభ్యుల కోసం వివరించబడినవి] అనుసరించడానికి దోహదపడ్డాయి. మిగిలినవన్నీ కూడా అనుసరిస్తాయని నా నమ్మకం, ఆశ.

—హెచ్‌.కె., కోల్‌కత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్. ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గారు వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ కరదీపిక కు పాఠకులను స్వాగతిస్తూ తన సందేశాన్ని ఇలా తెలిపారు, “పరమహంస యోగానందగారు తన జీవితపు ఆఖరి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్ సభ్యులు, తన కార్యాచరణము యొక్క ఎదుగుదల మరియు పురోగతిలో చురుకుగా పాల్గొనగలిగే ఒక సాధనంగా లేదా వ్యవస్థగా రూపొందించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఇప్పుడు వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ లాంఛనంగా ప్రారంభం కావడంతో ఆ స్వప్నం నెరవేరింది.”

2021 జూన్‌లో జరిగిన ప్రారంభమైనప్పటి నుండి, ఈ శిష్య క్రమంలోని సాధారణ సభ్యులకు సేవ చేసే అనేక ఉత్తేజకరమైన కొత్త అవకాశాలను వి.ఎల్.డి. కలిగించింది — మరియు ఈ మార్గంలో తమ శిష్యత్వాన్ని మరింత గాఢతరం చేసుకోవడం గురించి వారు నేర్చుకోగలుగుతున్నారు. ఈ వ్యాసంలో, ప్రస్తుత పరిణామాలను మీతో మేము సంతోషంగా పంచుకుంటున్నాము.

అయితే ముందుగా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాలో క్రియాయోగిగా ఉండటంతోపాటు వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ (వి.ఎల్.డి.) లో కూడా ఎవరైనా సభ్యునిగా చేరదలచుకున్నారా అనే ప్రశ్నకు మధ్య సంబంధం గురించి ఇక్కడ కొంత నేపథ్యం ఉంది:

ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఒక వ్యక్తి క్రియాయోగ ప్రక్రియలో దీక్ష పొందినప్పుడు, అతను లేదా ఆమె పరమహంస యోగానందగారితో గురు-శిష్య సంబంధం — సహస్రాబ్దులుగా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క అత్యంత గౌరవనీయ సంప్రదాయం —లోకి ప్రవేశిస్తారు, మరియు వై.ఎస్.ఎస్. లేదా ఎస్.ఆర్.ఎఫ్. యొక్క క్రియాబాన్ సభ్యులవుతారు.

పవిత్రమైన క్రియా దీక్షను స్వీకరించే సమయంలో, క్రియాబాన్ లు శిష్యరికానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ చేస్తారు. కనీసం ఒక సంవత్సరం క్రియాబాన్ గా ఉన్న తరువాత, ఎవరైనా కోరుకుంటే వి.ఎల్.డి.లో చేరవచ్చు, పరమహంస యోగానందగారు ఉపదేశించిన సూత్రాల ప్రకారం స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఆధ్యాత్మిక నిబద్ధతకు సంబంధించిన అదనపు ప్రతిజ్ఞను చేయవచ్చు మరియు గురుదేవుల పట్ల భక్తి మరియు ఆయన కార్యానికి సహాయం చేయాలనే కోరిక యొక్క వ్యక్తీకరణగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కు క్రమం తప్పకుండా సేవ చేయవచ్చు.

వి.ఎల్.డి. ప్రారంభించినప్పటి నుండి, వి.ఎల్.డి. సభ్యులకు వి.ఎల్.డి. ప్రతిజ్ఞ ప్రకారం వారి జీవితాలకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడటం, సన్యాసులచే ప్రత్యేకంగా రూపొందించిన తరగతుల ద్వారా వారి అంతరిక ఆధ్యాత్మిక జీవితాన్ని బలోపేతం చేయడం మరియు సాంగత్యము ద్వారా ఒకరితో ఒకరు బలమైన ఆధ్యాత్మిక బంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి సారించడం జరిగింది.

ఈ వ్యాసంలో, వాలంటరీ లీగ్ యొక్క వై.ఎస్.ఎస్. విభాగం చేపట్టిన కార్యక్రమాలు — ప్రత్యేకించి, వి.ఎల్.డి సభ్యులు తమ సాధనను గాఢతరం చేసుకోవడానికి మరియు గురు-సేవలో తమను తాము సమర్పించుకోవడంలో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలలో భాగమై పొందిన ప్రయోజనాలు — గురించి మీరు చదవవచ్చు.

వి.ఎల్.డి. తరగతుల యొక్క అద్వితీయ మద్దతు మరియు విధానం

ప్రారంభోత్సవం తరువాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్ ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్‌ సత్సంగంలో స్వామి చిదానందగారు ప్రముఖంగా ఇలా ప్రస్తావించారు: “వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ అనేది ప్రప్రధమముగా శిష్యరికం, తరువాత ఆ చైతన్యంతో కార్యాలను నిర్వహించడం — ఆ దృక్పథంతో, గురుదేవుల పట్ల ఆంతరిక అనుబంధం మరియు అంకితభావంతో ఉండడం – సంక్షిప్తంగా చెప్పాలంటే, జీవితంలోను మరియు గురుదేవుల కార్యాచరణలోను సేవ చేయడానికి నిబద్ధతతో ఉండే వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన క్రియాబాన్ శిష్యులు – వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ అంటే ఇదే.”

వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నెలవారీ నిర్వహించే వి.ఎల్.డి. తరగతులు మరియు వర్క్‌షాప్‌లు, వి.ఎల్.డి సభ్యులకు స్ఫూర్తిదాయకమైన పరిజ్ఞానం మరియు ఆచరణాత్మక సలహాలను అందిస్తాయి. సభ్యులు తాము చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడంలో సహాయపడటానికి మరియు పరమహంసగారి బోధనల సూత్రాలను తమ చైతన్యంలోకి మరింత గాఢంగా గ్రహించడంలో వారికి సహాయపడటానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.

గత రెండేళ్లలో వై.ఎస్.ఎస్. సన్యాసులు ప్రసంగించిన వి.ఎల్.డి. ఆన్‌లైన్ తరగతులలో భాగంగా ఈ క్రింది కీలక అంశాలు ప్రసంగించబడ్డాయి:

  • ఆధ్యాత్మిక దినచర్య ద్వారా మన పురోగతిని భగవంతుని వైపు వేగవంతం చేసుకోవడం
  • హాంగ్-సా ప్రక్రియ యొక్క సాధనా పరిజ్ఞానము
  • క్రియాబాన్ ల కోసం సమతుల్య జీవితం యొక్క ప్రాముఖ్యత
  • శ్రీ దయామాతగారి ఆదర్శ వాక్యంపై పర్యాలోచన: ప్రేమ, సేవ, ధైర్యం, విశ్వాసం

వై.ఎస్.ఎస్. సన్యాసులు ఇచ్చిన ఈ తరగతులను వీక్షించలేకపోయిన వి.ఎల్.డి సభ్యులు లేదా వాటిని మళ్ళీ సమీక్షించాలనుకునేవారు ఈ వీడియోలను వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. వెబ్‌సైట్‌లోని కంటెంట్ (Content) విభాగం లో వీక్షించవచ్చు. లాగిన్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి వి.ఎల్.డి. సభ్యులు తమ డివోటీస్ పోర్టల్ లో వీటిని సందర్శించవచ్చు.

అదేకాక, ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నిర్వహించిన ఈ క్రింది ఆన్‌లైన్ వి.ఎల్.డి. తరగతులు మరియు వర్క్‌షాప్‌లలో వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. సభ్యులు కూడా ఆసక్తిగా పాల్గొని ప్రయోజనం పొందారు:

  • శిష్యరికం: దివ్య ప్రయోజనం కోసం ఒక జీవితం
  • ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ యొక్క ఉద్దేశ్యం
  • ఆత్మపరిశీలన: స్వీయ-ప్రావీణ్యతకు కీలకం
  • శిష్యుడిగా మీ జీవితాన్ని గాఢతరం చేసుకోవడం
  • భగవంతుని కొరకు జ్వలించండి
  • గురు శిష్యుల సంబంధం
  • మన ఆధ్యాత్మిక ప్రయత్నాలను నిత్య నూతనంగా ఉంచకోవడం

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల తరగతులు ఎస్.ఆర్.ఎఫ్. వి.ఎల్.డి. కంటెంట్ (Content) విభాగంలో ఉంచబడ్డాయి. అవి వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. వెబ్‌సైట్ కంటెంట్ (Content) విభాగం ద్వారా అవి వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. సభ్యులకు అందుబాటులో ఉన్నాయి.

వై.ఎస్.ఎస్., ఎస్.ఆర్.ఎఫ్. లకు చెందిన సన్యాసులు సంయుక్తంగా నిర్వహించే సత్సంగాలు ప్రపంచంలోని పరస్పర దిశల నుంచి ప్రత్యక్ష ప్రసారం కావడం వి.ఎల్.డి. తరగతుల యొక్క ప్రత్యేక విశిష్టత. క్రియాబాన్ సోదర సోదరీమణుల ప్రపంచవ్యాప్త కుటుంబంలో ఐక్యతను మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి అవి సహాయపడ్డాయి.

ఈ సత్సంగాలలోని అంశాలు:

  • శ్రీ శ్రీ పరమహంస యోగానంద: ప్రాచ్య పాశ్చాత్య దేశాలకు దైవ-నియుక్తుడైన ఒక సద్గురువు
  • వి.ఎల్.డి. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు
  • మీ దివ్య ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం

సన్యాసులు తమ పరిజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు, సత్సంగ అనుభవం ఇంట్లో సుద్బుద్ధులైన పెద్దల సాంత్వన సన్నిధిలో ఉన్నట్లుగా, ఔదార్యంతో ఆధ్యాత్మిక ప్రేరణను నాతో పంచుకున్నట్లు అనిపించింది.

—ఆర్.ఎం., పూణె

సమావేశంలో నాకు వ్యక్తిగతంగా విలువైన అనేక ఆచరణాత్మకమైన రత్నాలు లభించాయి. తమ సాధనలో ఇలాంటి అడ్డంకులను అధిగమించిన సన్యాసుల నుంచి ఈ పరిజ్ఞానము వచ్చింది. ఈ మార్గంలోని అనుభవజ్ఞులైనవారికి మరియు కొత్త శిష్యులకు కూడా ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి.

—యు.వి., ఢిల్లి

వి.ఎల్.డి. సభ్యుల సహవాస కార్యక్రమాలు

2022 మార్చి, జూలై, సెప్టెంబర్ నెలల్లో వి.ఎల్.డి. సభ్యలైన వాలంటీర్లు నిర్వహించిన మూడు ఆన్‌లైన్‌ ఫెలోషిప్‌ లలో వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. సభ్యులు పాల్గొన్నారు.

2022 మార్చిలో వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి. మెంబర్ ఫెలోషిప్ లో సన్యాసుల సత్సంగముతోపాటు, వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన దీర్ఘకాలిక వి.ఎల్.డి. సభ్యమండలిలోని నలుగురు సభ్యులు తమ సాధన, సేవలలో తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకోవడం జరిగింది. భారతదేశం నలుమూలలా ఉన్న వై.ఎస్.ఎస్. వి.ఎల్. డి. సభ్యులు జూమ్ (Zoom) లోని విరామ సమావేశ గదు (breakout rooms) ల్లో కూడి, సన్యాసుల సందేశాన్ని మరియు సభ్యమండలి వారు పంచుకున్న పరిజ్ఞానాన్ని ప్రతిఫలించే ఒక సదుపాయమైన విరామ సమావేశము (breakout session) కూడా ఏర్పాటు చేసుకోగలిగారు.

సభ్యమండలి వారు పంచుకున్న వ్యక్తిగత కథనాలు నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. భక్తుల కథనాలను వినడం ఒక అరుదైన అనుభవం; గురుదేవుల అందమైన కుటుంబానికి ఇవి అద్భుతమైన ఉదాహరణలు. నాకు ముఖ్యంగా అనిపించిన విశేషాలు: స్వామీజీ ప్రసంగం, సభ్యమండలి చర్చాగోష్ఠి, విరామ సమావేశ గదులు! ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ కార్యక్రమంలో ప్రతీదీ!

—ఫెలోషిప్ లో పాల్గొన్న ఒక సభ్యుడు.

జూలై, సెప్టెంబర్ 2022 ఫెలోషిప్‌ లు “లివింగ్ ది వి.ఎల్.డి. ప్లెడ్జ్” అనే అంశంపై దృష్టి సారించాయి. వి.ఎల్.డి. సభ్యులందరూ చేసే ప్రతిజ్ఞ గురించి ఇంటి వద్ద పర్యాలోచించేందుకు మరియు పరిశీలించేందుకు వి.ఎల్.డి. తరగతుల నుండి వీడియో క్లిప్ లను మరియు కరదీపిక యొక్క సన్నాహక పఠనాన్ని దానితో పాటు ఇవ్వడం జరిగింది. ప్రతిజ్ఞ గురించి నిశ్శబ్ద చింతనం చేసిన తరువాత ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ గురించి తమ అవగాహనను మరియు దానిని ఎలా ఆచరిస్తున్నారనే విషయాన్ని పంచుకున్నారు.

కార్యక్రమాలలో తమను గాఢంగా ప్రేరేపించిన, స్పృశించిన వ్యాఖ్యానాలను మరియు గమనించిన విషయాలను చాలా మంది పంచుకున్నారు. వి.ఎల్.డి.లో చేరడం చాలా ఉద్వేగంగా ఉందని, “ఇవి తన జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలని” ఒక భక్తుడు తెలిపాడు. మరొకరు ఇలా అన్నారు: “గురుదేవుల మార్గంలో అంకితభావంతో జీవితాన్ని గడుపుతున్న తోటి భక్తుల అంతర్దృష్టి, స్ఫూర్తిదాయక ప్రేరణను కలిగించాయి. అవి నా శక్తిని తిరిగి కేంద్రీకరించడానికి నాకు సహాయపడ్డాయి మరియు “ఆధ్యాత్మిక సహవాసం” యొక్క ప్రాముఖ్యత గురించి గురుదేవులు ఎందుకు నొక్కిచెప్పేవారనే దానిపై నాకు నూతన దృష్టికోణాన్ని కూడా అందించాయి.

నోయిడాలో వి.ఎల్.డి. ఏకాంత ధ్యానవాసం

నోయిడాలో వి.ఎల్.డి ఏకాంత ధ్యానవాసం సందర్భంగా తరగతిని నిర్వహిస్తున్న స్వామి స్మరణానంద

ఏప్రిల్ 14 – 16, 2023 లో వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ (వి.ఎల్.డి.) సభ్యులు పాల్గొనేందుకు వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో ఒక ప్రత్యేక వారాంతపు ఏకాంత ధ్యాన వాసం నిర్వహించబడింది మరియు వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం, ఇగత్‌పురి, పూణే, చెన్నై మరియు కోయంబత్తూర్ ఏకాంత ధ్యాన వాస కేంద్రాలలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

“మన సాధనలో సేవ యొక్క పాత్ర” మరియు “మన ధ్యానాలను మరింత గాఢంగా మరియు మధురంగా చేసుకోవడం” అనే అంశాలపై ధ్యానాలు మరియు సత్సంగాలతో కూడిన ఈ ఏకాంత ధ్యాన వాసం సన్యాసులచే నిర్వహించబడింది.

వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో జరిగిన వి.ఎల్.డి. ఏకాంత ధ్యాన వాసానికి హాజరుకావడం ఒక పరివర్తనాత్మక అనుభవం, ఇది నాకు ఆంతరిక భద్రతను మరియు ప్రశాంతతను అందించింది. నా ప్రాపంచిక విధులపట్ల, వాటి స్వభావంతో సంబంధం లేకుండా—సంతోషకరమైనదైనా, కాకపోయినా, కష్టమైనా, సులభమైనదైనా, వాటి పట్ల నేను నూతనోత్సాహాన్ని కనుగొన్నాను. ఈ అనుభవం నా దృక్పథాన్ని మార్చేసింది, నా పనిని సేవా దృక్పథంతో చేయడానికి నాకు మార్గనిర్దేశం చేసింది. అలాగే, నా ధ్యానాలు మరింత క్రమబద్ధంగాను, గాఢంగాను మరియు మధురంగాను మారాయి.

— ఎం. ఎం., భువనేశ్వర్

నోయిడాలో స్వామి స్మరణానంద, స్వామి ఆద్యానంద నేతృత్వంలో జరిగిన చర్చా కార్యక్రమం మరో విశేషం. సాధన మరియు వి.ఎల్.డి. గురించి అడిగిన వివిధ ప్రశ్నలపై సన్యాసులు సంభాషించారు; అదే విధంగా, భిన్న నేపథ్యాల నుండి జీవితంలోని వివిధ దశలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పది మంది వి.ఎల్.డి. సభ్యులు — ఐదుగురు పురుషులు మరియు ఐదుగురు మహిళలు — వారి స్వీయ దృక్కోణాలు మరియు అనుభవాల నుండి అంతర్దృష్టులను పంచుకోవడం ద్వారా వారి వివరణలను పూర్తి చేశారు.

సంగమాల వద్ద వి.ఎల్.డి. సమాచార కేంద్రం మరియు సమాచార వేదిక

వై.ఎస్‌.ఎస్-వి.ఎల్.డి-సమాచార-వేదిక-వై.ఎస్.ఎస్-సంగమం-2023-హైదరాబాద్-ఫిబ్రవరి-1
ఫిబ్రవరిలో జరిగిన వై.ఎస్.ఎస్. సంగమం 2023, హైదరబాద్, వద్ద వి.ఎల్.డి. సమాచార వేదిక

మరింతగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిన వై.ఎస్.ఎస్. భక్తులు మరియు క్రియాబాన్ లతో, వి.ఎల్.డి. యొక్క సమాచారాన్ని పంచుకునే అవకాశాన్ని వి.ఎల్.డి. సభ్యులు అందిపుచ్చుకున్నారు.

హైదరాబాద్ లో వై.ఎస్.ఎస్. సంగమం 2023 సందర్భంగా, వివిధ కేంద్రాలు మరియు నగరాలకు చెందిన వి.ఎల్.డి. సభ్యులు సమష్టిగా వి.ఎల్.డి. సభ్యత్వంలోని కీలక అంశాలను ఏకతాటిపైకి తెచ్చారు. ఆసక్తిగా ఉన్న క్రియాబాన్ భక్తులతో ఈ సమాచారాన్ని పంచుకోవడానికి వారు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది గురు-భాయ్ లు, గురు-బెహెన్ లు ఈ విభాగాన్ని సందర్శించారు.

అక్టోబర్ 2023లో నోయిడా ఆశ్రమంలోని వి.ఎల్.డి. సమాచార వేదిక
రాంచీలో నవంబర్ లో జరిగిన సంగమం సందర్భంగా వి.ఎల్.డి. సమాచార వేదిక

వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ మూడవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా, ఎంతో మంది వై.ఎస్.ఎస్. భక్తుల జీవితాలలో ప్రాప్తించిన దీవెనలకు వినమ్రతాపూర్వకమైన కృతజ్ఞతలతో మేము నిండి ఉన్నాము. ప్రస్తుత వి.ఎల్.డి. సభ్యుల జీవితాలలోను, భవిష్యత్తులో శిష్యరికం, దైవసేవలకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేవారిలోను ఈ గృహస్థ శిష్యక్రమం పట్ల పరమహంసగారి దార్శనికత ఎలా వికసిస్తుందో, ఎలా విస్తృతమవుతుందో చూడాలని మేము ఎదురు చూస్తున్నాము.

మరింత తెలుసుకోవడానికి

వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి వై.ఎస్.ఎస్. వి.ఎల్.డి వెబ్‌సైట్‌ని సందర్శించండి. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి వి.ఎల్.డి. ఉద్దేశాన్ని వివరిస్తూ చేసిన ప్రసంగం నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ ను మీరు అక్కడ చూడవచ్చు.

మీకు వై.ఎస్.ఎస్. డివోటీ పోర్టల్ ఖాతా ఉంటే, వాలంటరీ లీగ్ ఆఫ్ డివోటీస్ కరదీపిక ను కనుగొనడానికి మీరు అక్కడ లాగిన్ చేయవచ్చు, ఇందులో వి.ఎల్.డి. యొక్క చరిత్ర, లక్ష్యం మరియు వి.ఎల్. డి. ప్రతిజ్ఞ యొక్క సమగ్ర నివేదన ఉంటుంది. ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ద్వారా కూడా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్ లు కరదీపిక ను చూసే సౌలభ్యం పొందవచ్చు.

para-ornament

ఇతరులతో పంచుకోండి