మహావతార్ బాబాజీ స్మృతి దినం వేడుకలు, ద్వారహాట్

రెండు రోజుల కార్యక్రమం

)

సోమవారం, జూలై 24, 2023 — మంగళవారం, జూలై 25, 2023

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — ద్వారహాట్
ద్వారహాట్ – 263653, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

9756082167, 9411708541

ఈ-మెయిల్:

చిరునామా:

కార్యక్రమ వేదిక

ఈ కార్యక్రమం గురించి

ఎవరైనా భక్తితో బాబాజీ నామమును ఉచ్చరిస్తే ఆ భక్తునికి తక్షణమే ఆధ్యాత్మిక దీవెన లభిస్తుంది.

— లాహిరీ మహాశయులు

అంధయుగాల్లో మరుగున పడిపోయిన శాస్త్రీయమైన క్రియాయోగ ప్రక్రియను ఈ యుగంలో మహావతార్ బాబాజీయే పునరుద్ధరించారు…. 1920వ సంవత్సరంలో పరమహంస యోగానందగారు అమెరికా వేళ్ళే కొంత సమయం ముందు, మహావతార్ బాబాజీ కలకత్తాలోని యోగానందగారి ఇంటికి వచ్చారు, అక్కడ ఆ యువ సన్యాసి, తాను చేపట్టబోయే కార్యానికి ఆ భగవంతుని దివ్య హామీ కొరకై దీర్ఘంగా ప్రార్థిస్తున్నారు. అప్పుడు బాబాజీ ఇలా అన్నారు, “నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు, భయపడకు, నీకు రక్ష ఉంటుంది. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే.”

గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందతో మహావతార్ బాబాజీ జరిపిన ఈ సమావేశాన్ని, ప్రతి సంవత్సరం జూలై 25న మహావతార్ బాబాజీ స్మృతి దినంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.

ఈ సందర్భంగా వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమంలో 2023 జూలై 24, 25 తేదీల్లో రెండు రోజుల కార్యక్రమం జరిగింది. జూలై 25న బాబాజీ గుహకు యాత్ర నిర్వహించబడింది మరియు ఆశ్రమం నుండి ఊరేగింపు ప్రారంభించబడింది. గుహ వద్ద ధ్యానం, భజన మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి

సాయంత్రం ఆశ్రమంలో ఒక ప్రత్యేక ధ్యానం నిర్వహించబడింది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి