జన్మాష్టమి స్మారకోత్సవ ధ్యానం

గురువారం, సెప్టెంబర్ 7, 2023

ఉదయం 6:30 గం.

– ఉదయం 8:00 గం.

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

భగవద్గీతలోని శ్రీ కృష్ణుడి సందేశం ఆధునిక యుగానికి మరియు ఏ యుగానికైనా సరియైన సమాధానం: కర్తవ్య నిర్వహణ, రాగ ద్వేషాల పట్ల విముఖత మరియు దైవ-సాక్షాత్కారం కోసం ధ్యానం చేయడమే యోగం.

— పరమహంస యోగానంద

పవిత్రమైన భగవాన్ కృష్ణుని జన్మదినమైన జన్మాష్టమిని, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆనందం మరియు భక్తితో జరుపుకుంటారు. ఆయన దివ్యప్రేమ యొక్క అవతారంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, శ్రీకృష్ణుడు చాలా మంది భక్తుల హృదయాలలో యోగీశ్వరుడిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు, అంటే “యోగ ప్రభువు.”

అర్జునుడిని ఆదర్శ యోగి (యోగ-ధ్యానం యొక్క శాస్త్రీయ పద్ధతులను అభ్యసించడం) అని ప్రబోధిస్తూ, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు: “శరీరాన్ని శాసించే తపస్వి కంటే యోగి గొప్పవాడు, జ్ఞాన మార్గాన్ని లేదా కర్మ మార్గాన్ని అనుసరించే వారి కంటే కూడా గొప్పవాడు; నువ్వు యోగిగా ఉండు!”

ఈ గొప్ప అవతారంతో మన మనస్సులను మరియు హృదయాలను అనుసంధానించుకోవడానికి జన్మాష్టమి మనకు ఒక అందమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ పవిత్ర దినాన్ని (ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న) ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించిన ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానం ద్వారా స్మారకోత్సవంగా నిర్వహించాము.

పరమహంస యోగానందగారి ఆశ్రమాల నుండి జన్మాష్టమి 2023 సందేశం

జన్మాష్టమి సందర్భంగా పరమహంస యోగానందగారి ఆశ్రమం నుండి సందేశాన్ని చదవడానికి, దయచేసి ఈ లింక్‌ని సందర్శించండి:

ఈ ఆన్‌లైన్ కార్యక్రమంతో పాటు, మా ఆశ్రమాలు, కేంద్రాలు, మరియు మండళ్ళలో ప్రత్యక్షంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

భగవద్గీతలో భగవాన్ కృష్ణుని అమర సందేశానికి ప్రతీకగా ఆయన పట్ల మీకు ఉన్న భక్తి మరియు కృతజ్ఞతకు గుర్తుగా ఈ సందర్భంలో మీరు ఏమైనా సమర్పించాలనుకుంటే, దయచేసి క్రింద ఉన్న లింక్‌ను సందర్శించండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి