ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం, సన్యాసులు ఇంగ్లీషులో మూడు గంటల పాటు నిర్వహించే దీర్ఘ ధ్యానాలలో చేరమని, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం, రికార్డు చేయబడిన శక్తిపూరణ వ్యాయామాలతో, తరువాత వై.ఎస్.ఎస్. సన్యాసి మార్గనిర్దేశ ధ్యానంతో మొదలవుతుంది.
ప్రారంభ ప్రార్థనతో ధ్యాన కార్యక్రమం మొదలవుతుంది, తరువాత స్ఫూర్తిదాయక పఠనం, తరువాత నియమిత కాలం పాటు కీర్తనలు మరియు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. నిశ్శబ్ద ధ్యాన సమయంలో మార్పులు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల పాటు ఉంటుంది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసంతో మరియు ముగింపు ప్రార్థనతో ధ్యాన కార్యక్రమం ముగుస్తుంది.
ధ్యాన సమయం వివరాలు
ప్రతి నెల మొదటి ఆదివారం
ఇంగ్లీష్
ఉదయం 6.10 నుండి 9.30 వరకు
ఆన్లైన్ ధ్యాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. ధ్యాన కార్యక్రమంలో చేరడానికి, క్రింద ఇచ్చిన జూమ్ లింక్ లేదా యు ట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి.
దయచేసి గమనించండి:
- మరుసటి రోజు (సోమవారం) రాత్రి 10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం), రికార్డు చేయబడిన ఈ ధ్యాన కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.
- సన్యాసులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో ఈ ఆన్లైన్ ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడవు.
మీరు వీటిని చదవడానికి ఇష్టపడవచ్చు: