స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినం సందర్భంగా

స్మారకోత్సవ ధ్యానం

శనివారం, మార్చి 9, 2024

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.

— స్వామి శ్రీయుక్తేశ్వర్

స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు జ్ఞానావతారులుగా, లేదా “జ్ఞానము యొక్క అవతారం” గా గౌరవించబడతారు. యుక్తేశ్వర్ గారి మహాసమాధి (శరీరం నుండి దైవ-సాక్షాత్కారం పొందిన యోగుల అంతిమ సచేతన నిష్క్రమణ) సందర్భంగా, ఒక ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానాన్ని ఆంగ్లంలో ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూర్చే ఈ కార్యక్రమం శనివారం, మార్చి 9 న కీర్తనగానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానంతో కలిపి నిర్వహించబడింది.

ఈ సందర్భంగా, ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంతో పాటు, వ్యక్తిగతంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలను మన ఆశ్రమాలు మరియు కేంద్రాలు నిర్వహించాయి.

మీరు వీటిని కూడా అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఈ ప్రత్యేక దినమున, తమ జీవితంలో వారు కురిపించిన ఆశీస్సులకు కృతజ్ఞతగా తమ గురువుకు భక్తులు గురు-ప్రణామిని సమర్పిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమర్పణ చేసేందుకు మీకు స్వాగతం. మీ విలువైన విరాళం, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల క్రియాయోగ బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి