ఏకాంత ధ్యాన వాసం, నోయిడా

మూడు-రోజుల కార్యక్రమం

)

శుక్రవారం, మార్చి 31, 2023 - ఆదివారం, ఏప్రిల్ 2, 2023

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — నోయిడా
పరమహంస యోగానంద మార్గ్, బి – 4, సెక్టార్ 62,
నోయిడా – 201307, గౌతంబుద్ధానగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

9899811808, 9899811909

ఈ-మెయిల్:

చిరునామా:

కార్యక్రమ వేదిక

ఈ కార్యక్రమం గురించి

నిశ్శబ్దం యొక్క అంతర్గత మందిరాన్ని నిర్మించుకోవడానికి మనకు ప్రేరణనిస్తూ, మన ప్రియమైన గురుదేవులు ఇలా అన్నారు:

మీ మనస్సు యొక్క ప్రధాన ద్వారం వెనుక ఉన్న నిశ్శబ్దపు లోతులలో, కనుగొనేందుకు ఎంతటి ఆనందం దాగి ఉందో ఏ మానవ జిహ్వా వర్ణించలేదు. కానీ మీరు ధ్యానం చేసి ఆ వాతావరణం సృష్టించుకోవాలి. గాఢంగా ధ్యానించేవారు అద్భుతమైన అంతర్గత నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి జీవించడం ఎలా అనే ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలు ఆధ్యాత్మిక పునరుద్ధరణను కోరుకునే వై.ఎస్.ఎస్ పాఠాల విద్యార్థులకు మరియు రోజువారీ జీవితంలో ఒత్తిళ్లను విడిచిపెట్టాలని కోరుకొనేవారికి అందుబాటులో ఉంటాయి — కొద్ది రోజులు మాత్రమే అయినప్పటికీ — దైవంపై అవగాహనను గాఢంగా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమాలు సమకూర్చే వాటి గురించి పరమహంస యోగానందగారు ఇలా అన్నారు, “అనంతం ద్వారా తిరిగి శక్తితో నింపబడే ప్రత్యేక ప్రయోజనం కోసం (మీరు) వెళ్ళే నిశ్శబ్దం యొక్క డైనమో (విద్యుచ్చాలక యంత్రం).”

శ్రద్ధాభక్తులు కలిగిన సాధకులు రోజువారీ జీవితంలోని నిరంతర కార్యకలాపాల నుండి తమ దృష్టిని ఉపసంహరించుకోవడానికి మరియు అంతర్గత నిశ్శబ్దంపై దృష్టి కేంద్రీకరించడానికి అద్భుతమైన అవకాశం కలుగుతుంది మరియు తద్ద్వారా భగవంతుని శాంతి మరియు ఆనందపు అమృతాన్ని పానం చేయగలుగుతారు. విశ్రాంతి తీసుకోవడానికి వారు ఏకాంత ధ్యాన వాసాలకు రావచ్చు, మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను, ప్రేరణను పొందవచ్చు లేదా గాఢమైన తలంపు, అవగాహన మరియు అంతర్గత మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే పరిష్కరించబడే ప్రశ్నలకు సమాధానాలను లేదా సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.

ఏకాంత ధ్యాన వాస సమయంలో, మీరు సేద తీరడం మరియు భగవంతుని సర్వవ్యాపక ఆశీస్సులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండడం మీ బాధ్యత. స్వచ్ఛమైన గాలిలో తిరగడం, వ్యాయామం చేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం ద్వారా శారీరకంగా సేద తీరండి. రోజువారీ జీవితంలోని బాధలను మరియు భారాలను వదిలిపెట్టి మానసికంగా సేద తీరండి. మీ బాహ్య కార్యకలాపాలను వదిలివేయండి. భగవంతుడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మరియు ఆయనే మీ మనస్సులో అత్యున్నత ఆలోచనగా మరియు మీ హృదయంలో రగిలే కోరికగా ఉండనివ్వండి. లోపల ఆయన సాన్నిధ్యం గురించి పెరుగుతున్న మీ అవగాహన మిగిలినదంతా చేస్తుంది. భగవంతుని పట్ల గాఢమైన అవగాహన పెంపొందించుకోవడానికి నిరంతరాయమైన పనుల నుండి వైదొలగడం వల్ల కలిగే అనుభవం, ఆయన మీ బలాన్ని పునరుద్దరించడానికి మరియు మీకు శాశ్వతమైన శాంతిని, ఆనందాన్ని అందించడానికి అనుమతిస్తుంది.

ఏకాంత ధ్యాన వాస కార్యకలాపాలు:

  • వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఏకాంత ధ్యాన వాసాలు, వై.ఎస్.ఎస్. శక్తిపూరణ వ్యాయామాలు, సామూహిక ధ్యానాలు, మరియు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కలిగి ఉంటాయి.
  • వీటిలో పాల్గొనేవారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి పుస్తకాలను మరియు రికార్డింగులను వ్యక్తిగత అధ్యయనం చేయడానికి మరియు వినడానికి ఉపయోగించుకోవచ్చు.
  • భక్తులు స్వచ్ఛమైన గాలిలో తిరగవచ్చు మరియు శారీరక విశ్రాంతి కోసం వ్యాయామం చేయవచ్చు.
  • అందమైన ఏకాంత ధ్యాన వాస దృశ్యాలలో విశ్రాంతి పొందడానికి మరియు భగవంతుని సాన్నిధ్యం పొందడానికి తగినంత ఖాళీ సమయం కూడా ఉంటుంది.
  • ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలకు అదనంగా భక్తులు వ్యక్తిగత ధ్యానం చేసుకోవచ్చు.
  • ఏకాంత ధ్యాన వాసులు కోరుకుంటే, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసితో నియమిత సమయంలో సంప్రదింపులు జరుపవచ్చు, వారు పరమహంస యోగానందగారి బోధనలు, మీ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి సంతోషంగా మార్గదర్శకత్వం చేస్తారు.

ఏకాంత ధ్యాన వాసానికి ప్రాథమిక మార్గదర్శకాలు:

ఏకాంత ధ్యాన వాసాల నుండి ప్రతిఫలం పొందే బాధ్యత మీపైనే ఉంటుంది. మీరు మీ ఆత్మను పునరుద్దరించుకోవడానికి వచ్చినా లేక అంతర్లీనంగా ఉన్న కష్టమైన ప్రశ్నలకు మరియు సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నా, మీ ప్రయత్నం యొక్క సఫలత చివరికి దేవునితో మీ వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది — జీవితం, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆనందానికి మూలమైన పరమాత్మ. మీరు కొలమానంలో అంతర్లీనంగా ఆయన సాన్నిధ్యపు అవగాహన ఏర్పరచుకొంటే, మీరు జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రేరణ, భరోసా మరియు మార్గదర్శకత్వం పొందుతారు.

ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆ అవగాహనను అభివృద్ధి చేసుకోవడానికి గొప్ప సహాయం లభిస్తుంది.

  • ఏకాంత ధ్యాన వాసపు కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనండి (సాధ్యమైనంత వరకు) మరియు మీరు బస చేసిన సమయంలో ఇతర కార్యకలాపాలలో పాల్గొనవద్దు.
  • ఏకాంత ధ్యాన వాస సమయంలో అంతర్గత వాతావరణాన్ని నిర్మించుకోవడానికి మరియు భగవంతునితో మరియు గురువులతో గాఢమైన అనుసంధానం పొందడానికి మౌనాన్ని పాటించండి.
  • సామూహిక కార్యకలాపాలలో తప్పనిసరిగా పాల్గొనండి, అవి మిమ్మల్ని సారూప్య ఆత్మల సహవాసంలోకి తీసుకువస్తాయి, తద్ద్వారా మీ మంచి ప్రయత్నాలను మరియు ఆకాంక్షలను బలోపేతం చేస్తాయి.
  • భగవంతుని సాన్నిధ్యాన్ని అభ్యసించండి. ప్రతి క్షణంలోను మరియు ప్రతి అనుభవంలోను భగవంతుడు మీ ప్రక్కనే ఉన్నాడని తెలుసుకోండి.
  • మీతో పాటు ఏవైనా లౌకికమైన సాహిత్యం అంటే పత్రికలు మరియు వార్తా పత్రికలు తెచ్చుకొని ఉంటే, ఏకాంత ధ్యాన వాసంలో వాటిని చదవడం నిలిపివేయండి.
  • ఏకాంత ధ్యాన వాసపు వాతావరణంలో మిమ్మల్ని మీరు ఏకాంతంగా ఉంచుకొన్నట్లయితే, మీ ఖాళీ సమయాలలో నిశ్శబ్దంగా ఉండడం మరియు భగవంతుని గురించి ఆలోచించడం సులభమవుతుంది. కాబట్టి ఏకాంత ధ్యాన వాస ప్రాంగణంలోనే ఉండండి.
  • మీతో పాటు మొబైల్ ఫోన్లను తెచ్చుకొన్నట్లయితే, వాటిని వాడడం నిలిపి వేయండి. తప్పనిసరి అయితే తప్ప మీరు ఇతరులకు ఫోన్ చేయడంగానీ, స్వీకరించడంగానీ చేయకండి.
  • చివరిదే కానీ చిన్నది కాదు, మీ ఏకాంత వాస ధ్యాన సమయంలో గాఢంగా ధ్యానించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. భగవంతునితో మీ సంబంధానికి ధ్యానమే పెద్ద పునాది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి