పరమహంస యోగానందగారి మహాసమాధి దినం సందర్భంగా

స్మారకోత్సవ ధ్యానం

గురువారం, మార్చి 7, 2024

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చెయ్యగలదు… భగవంతుని ప్రేమలో ఎంతగా మత్తెక్కి ఉండాలంటే, నీకు భగవంతుడు తప్ప ఇంకేమీ తెలియకూడదు; ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

మన గురుదేవుల మహాసమాధి (శరీరం నుండి దైవ-సాక్షాత్కారం పొందిన యోగుల అంతిమ సచేతన నిష్క్రమణ)ని స్మరించుకొనేందుకు, గురువారం, మార్చి 7న, ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 వరకు (భారత కాలమానం) ఒక ప్రత్యేక ధ్యానాన్ని ఆంగ్లంలో ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. కీర్తనగానం, స్ఫూర్తిదాయక పఠనం, మరియు ధ్యానంతో కలిపి ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా, ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంతో పాటు, వ్యక్తిగతంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలను మన ఆశ్రమాలు మరియు కేంద్రాలు నిర్వహించాయి.

ఈ ప్రత్యేక దినమున, తమ జీవితంలో వారు కురింపించిన ఆశీస్సులకు కృతజ్ఞతగా తమ గురువుకు భక్తులు గురు-ప్రణామిని సమర్పిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమర్పణ చేసేందుకు మీకు స్వాగతం. మీ విలువైన విరాళం, వారి ఆత్మ-విముక్తి బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి