సన్యాసుల పర్యటన, విజయనగరం

ఒక-రోజు కార్యక్రమం

)

ఆదివారం, జులై 2, 2023

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

హోటల్ కొండపల్లి గ్రాండ్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్,
ఎల్.ఐ.సి. బిల్డింగ్ ఎదుట, ఆర్‌.టి‌.సి కాంప్లెక్స్ దగ్గర,
విజయనగరం, ఆంధ్రప్రదేశ్

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

9848313177, 9182937416
8374734423, 9148449547

ఈ-మెయిల్:

చిరునామా:

యోగదా సత్సంగ ధ్యాన మండలి — విజయనగరం
C/o శ్రీమతి. యనమండ్ర సత్యవతి, డోర్ నంబర్: 23-8-3,
చిన్న వేంకటేశ్వర స్వామి మందిరం ఎదుట,
అయ్యకోనేరు ఉత్తరం, విజయనగరం — 535002,
ఆంధ్రప్రదేశ్

ఈ కార్యక్రమం గురించి

ఆనంద వనాన్ని మీ లోపల ఏర్పాటు చేయడం కోసం, నిశ్శబ్ద ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఈ విశ్వ సంరక్షకుడు మీ హృదయ ద్వారాలను తడుతున్నాడు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని నెరవేర్చడంలో సహాయం చేయడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో పర్యటిస్తారు. పరమహంస యోగానందగారి బోధనలకు తమను తాము పరిచయం చేసుకొవాలనుకొనే కొత్త వారికి మరియు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై లోతైన మార్గనిర్దేశం పొందేందుకు వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు ఈ సన్యాసుల పర్యటనలు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తాయి.

ఈ కార్యక్రమాల సందర్భంగా, మీ నిత్య జీవితంలో గురుదేవుల బోధనలను అన్వయించుకోవడానికి వై.ఎస్.ఎస్. సన్యాసుల మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశాన్ని మీరు కూడా పొందవచ్చు.

ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మన సాధనకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఈ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని తిరిగి రగిలిస్తుంది, మరియు చిత్తశుద్ధి గల ఇతర అన్వేషకులతో కలసి ధ్యానించడం మరియు వారి సాహచర్యం మీకు ఆనందాన్ని, ఆశీస్సులను పొందేందుకు సహాయం చేస్తుంది.

కార్యక్రమము యొక్క వివరాలలో ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య మార్పు ఉండవచ్చు, ఒక నమూనా వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది:

వివరాలు

ఉదయం 08:00 నుండి ఉదయం 9:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 10:00 నుండి ఉదయం 11:00 వరకు

హాంగ్-సా ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 02:30 వరకు

సన్యాసులతో వ్యక్తిగత సమావేశం
(అభ్యర్థన మేరకు అందుబాటులో ఉంటుంది)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ఓం ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు, ధ్యానం మరియు ముగింపు సత్సంగం

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి