సన్యాసుల పర్యటన, అనంతపురం

మూడు-రోజుల కార్యక్రమం

)

శుక్రవారం, జులై 14, 2023 — ఆదివారం, జులై 16, 2023

(క్రియా దీక్ష:

Sunday, July 16, 2023)

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

రెవెన్యూ కళ్యాణ మండపం (రెవెన్యూ భవన్),
కృష్ణ కళామందిర్ ప్రక్కన,
క్లాక్ టవర్ దగ్గర, అనంతపురం,
ఆంధ్రప్రదేశ్

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

9490695832, 9441665181
8019682209, 9440982776

ఈ-మెయిల్:

చిరునామా:

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం — అనంతపురం
C/o శ్రీ ఏ. నరసింహులు, డోర్ నెంబర్: 1-2-521,
గౌరవ్ గార్డెన్స్, 4వ రోడ్ ఎక్స్టెంషన్,
అనంతపురం – 515004, ఆంధ్రప్రదేశ్

ఈ కార్యక్రమం గురించి

ఆనంద వనాన్ని మీ లోపల ఏర్పాటు చేయడం కోసం, నిశ్శబ్ద ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఈ విశ్వ సంరక్షకుడు మీ హృదయ ద్వారాలను తడుతున్నాడు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని నెరవేర్చడంలో సహాయం చేయడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో పర్యటిస్తారు. పరమహంస యోగానందగారి బోధనలకు తమను తాము పరిచయం చేసుకొవాలనుకొనే కొత్త వారికి మరియు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై లోతైన మార్గనిర్దేశం పొందేందుకు వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు ఈ సన్యాసుల పర్యటనలు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తాయి.

ఈ కార్యక్రమాల సందర్భంగా, మీ నిత్య జీవితంలో గురుదేవుల బోధనలను అన్వయించుకోవడానికి వై.ఎస్.ఎస్. సన్యాసుల మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశాన్ని మీరు కూడా పొందవచ్చు.

ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మన సాధనకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఈ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని తిరిగి రగిలిస్తుంది, మరియు చిత్తశుద్ధి గల ఇతర అన్వేషకులతో కలసి ధ్యానించడం మరియు వారి సాహచర్యం మీకు ఆనందాన్ని, ఆశీస్సులను పొందేందుకు సహాయం చేస్తుంది.

కార్యక్రమము యొక్క వివరాలలో ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య మార్పు ఉండవచ్చు, ఒక నమూనా వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది:

మొదటి రోజు - కార్యక్రమం వివరాలు

ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 వరకు

ప్రారంభ సత్సంగం

ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

హాంగ్-సా ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 04:30 నుండి సాయంత్రం 06:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

సాయంత్రం 06:30 నుండి రాత్రి 07:30 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

రాత్రి 07:30 నుండి రాత్రి 08:30 వరకు

గురుదేవులపై వీడియో ప్రదర్శన

రెండవ రోజు - కార్యక్రమం వివరాలు

ఉదయం 06:00 నుండి ఉదయం 09:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 09:45 నుండి ఉదయం 10:45 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

ఓం ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ప్రశ్నలు-జవాబులు

సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

సాయంత్రం 06:30 నుండి రాత్రి 07:30 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

మూడవ రోజు - కార్యక్రమ వివరాలు

ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

క్రియాయోగ దీక్ష

మధ్యాహ్నం 02:00 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ముగింపు సత్సంగం మరియు ప్రసాదం

సాయంత్రం 04:00 నుండి సాయంత్రం 06:00 వరకు

క్రియాయోగంపై సమీక్ష మరియు తనిఖీ
(వై.ఎస్.ఎస్. క్రియాబాన్లకు మాత్రమే)

క్రియాయోగ దీక్ష స్వీకరించడం:

అర్హత కలిగిన భక్తులకు దీక్షా ప్రదానం చేయడానికి వై.ఎస్.ఎస్. సన్యాసులు క్రియాయోగ దీక్షా వేడుకను నిర్వహిస్తారు. దానిలో పాల్గొనడానికి మరియు అర్హతకు సంబంధించిన వివరాలను క్రింద గమనించవచ్చు:

క్రియాయోగం స్వీకరించడానికి అర్హత:

  • వై.ఎస్.ఎస్. పాఠాలతో పాటు జత చేయబడిన ప్రశ్నాపత్రానికి సంతృప్తికరమైన సమాధానాలు సమర్పించడంపైన క్రియాయోగం తీసుకోవడానికి అర్హత ఆధారపడి ఉంటుంది.
  • క్రియాయోగాన్ని స్వీకరించాలంటే, మొదటి మూడు ప్రాథమిక యోగదా ప్రక్రియలను నియమముగా కొన్ని నెలల పాటు భక్తుడు సాధన చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మీరు ప్రశ్నాపత్రంలో గమనించవచ్చు.
  • వై.ఎస్.ఎస్. గురు పరంపర పట్ల మరియు యోగదా సత్సంగ మార్గం పట్ల భక్తి మరియు విధేయతలకు సంబంధించిన క్రియాయోగ ప్రతిజ్ఞా పత్రాన్ని సంతకంతో పాటు సమర్పించవలసి ఉంటుంది.

దయచేసి గమనించండి:

  • మీరు క్రియాయోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకొంటే, మరియు ఇప్పటికీ ప్రశ్నాపత్రానికి సమాధానాలను పంపించకపోతే, మీరు కార్యక్రమానికి హాజరవుతున్న కేంద్రం/మండలి లో వాటిని సమర్పించవచ్చు, ఆ నగరానికి సన్యాసులు చేరిన తరువాత వాటిని తనిఖీ చేయడం జరుగుతుంది.
  • మీరు వాటిని ఇప్పటికే రాంచీకి సమర్పించి మరియు క్రియాయోగం స్వీకరించడానికి లిఖితపూర్వక ఆమోదం పొంది ఉంటే, ఆమోదం పొందిన ఆ లేఖను కేంద్రం/మండలి వద్ద నమోదు చేయించుకోవడానికి దయచేసి తీసుకువెళ్ళండి.

 

క్రియాయోగ దీక్షా వేడుకలో పాల్గొనడం:

కార్యక్రమ వేడుక వద్ద క్రియాయోగ దీక్ష పొందాలనుకొనే వారందరితో పాటు, క్రియాయోగ పాఠాలను స్వీకరించి ఇప్పటి వరకు క్రియా వేడుకలో పాల్గొననివారు మరియు లాంఛనంగా దీక్షను స్వీకరించి, క్రియా వేడుకలో పాల్గొందామనుకొనే క్రియాబాన్లు అందరూ సంబంధిత కేంద్రంలో కనీసం ఒక రోజు ముందుగా నమోదు చేసుకోగలరు, మరియు అవసరమైన ప్రవేశ పత్రాన్ని వేడుకకు తీసుకు రాగలరు.

క్రియాయోగ దీక్షలో నమోదు కోసం మరియు క్రియాయోగ సమీక్షలో కూడా పాల్గొనడం కోసం దయచేసి మీ క్రియాబాన్ గుర్తింపు పత్రాన్ని తీసుకురండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి