మనఃపూర్వకంగా అపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపిక అయ్యావు. సంసార బంధాలతో, భారమైన లౌకిక విధులతో చిక్కులు పడుతున్న లక్షలాది జనం, తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు.
— లాహిరీ మహాశయులతో మహావతార్ బాబాజీ (ఒక యోగి ఆత్మకథ)
సెప్టెంబరు 30వ తేదీ శనివారం, శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ స్మారకోత్సవాన్ని (జన్మదినోత్సవం) వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించిన ప్రత్యేక ధ్యానంతో జరుపుకున్నాము. ఈ స్మారక కార్యక్రమం ప్రారంభ ప్రార్థనతో మొదలయ్యి నియమిత సమయంపాటు పఠనము, కీర్తనగానం మరియు ధ్యానంతో కూడి జరిగింది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా ఆన్లైన్ కార్యక్రమంతో పాటు, మా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలో వ్యక్తిగతంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.
మీరు వీటిని కూడా అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
ఈ సందర్భంగా మీరు సాంప్రదాయక సమర్పణ చేయాలనుకుంటే, దయచేసి దిగువ ఇవ్వబడిన లింక్లో మా వెబ్సైట్ను సందర్శించండి. మీకు మేము ప్రగాఢ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ప్రత్యేక కృప మరియు ఆశీస్సులకు కృతజ్ఞతగా మీ సమర్పణను స్వీకరిస్తాము.