సంక్షిప్త జీవిత చరిత్ర రూపణ
రాజర్షి జనకానందగారు (జేమ్స్ జె.లిన్) పరమహంస యోగానందగారికి ప్రియమైన శిష్యుడు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఆయనకు మొదటి వారసుడిగా ఫిబ్రవరి 20, 1955 నుండి ఆయన పరమపదించే వరకు పనిచేశారు. మిస్టర్ లిన్ మొదట 1932లో పరమహంసగారి నుండి క్రియాయోగ దీక్షను తీసుకున్నారు; ఆయన ఆధ్యాత్మిక పురోగతి చాలా వేగంగా ఉండింది, గురువుగారు 1951లో రాజర్షి జనకానంద అనే సన్యాసి బిరుదును ఆయనకు ఇచ్చేవరకు ఆయనని “సెయింట్ లిన్” అని ప్రేమగా పిలిచేవారు.ఈ జీవిత చరిత్ర రూపణ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచురించిన రాజర్షి జనకానంద: ఎ గ్రేట్ వెస్ట్రన్ యోగి (Rajarsi Janakananda: A Great Western Yogi) పుస్తకం నుండి సేకరించారు. ఈ పుస్తకంలో మరింత వివరమైన జీవిత చరిత్ర మరియు ఆయన ప్రసంగాల నుండి కొన్ని సంగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనతో పరమహంసగారి వ్యక్తిగత కరస్పాండెన్స్ యొక్క అరవైకి పైగా పేజీలను కలిగి ఉంది – వారు పంచుకున్న సన్నిహిత ఆధ్యాత్మిక అనుసంధానము యొక్క సంగ్రహావలోకనం అందించే మార్గదర్శకత్వం మరియు ప్రేమ మాటలు, గురు-శిష్యుల సంబంధాల లోతును శక్తివంతంగా తెలియజేస్తాయి.
రాజర్షి ప్రసంగాల యొక్క సంక్షిప్త ఆడియో రికార్డింగ్‌ల రెండు సీడీలు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క కలెక్టర్ సిరీస్ లోని పరమహంస యోగానందగారి అరుదైన రికార్డ్ చేసిన ప్రసంగాలతో పాటు చేర్చబడ్డాయి: